కాలం చెల్లిన బీర్లు.. మండిపడుతున్న మందుబాబులు

ABN , First Publish Date - 2020-09-05T20:26:03+05:30 IST

ఒంగోలులోని మద్యం షాపుల్లో కాలం చెల్లిన బీర్లు అమ్ముతున్నారంటూ మందుబాబులు మండిపడుతున్నారు.

కాలం చెల్లిన బీర్లు.. మండిపడుతున్న మందుబాబులు

ప్రకాశం: ఒంగోలులోని మద్యం షాపుల్లో కాలం చెల్లిన బీర్లు అమ్ముతున్నారంటూ మందుబాబులు మండిపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున బీర్లు మిగిలిపోయాయని.. వాటినే ఇప్పుడు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే తాము ప్రభుత్వ అనుమతితోనే అమ్మకాలు జరుపుతున్నామంటున్న షాపుల సిబ్బంది చెబుతున్నారు. 


 ఇదిలా ఉంటే, ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపీలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయ్యింది. 

Updated Date - 2020-09-05T20:26:03+05:30 IST