-
-
Home » Andhra Pradesh » Will go to High Court on Bigg Boss Narayana
-
‘బిగ్‌బాస్’పై హైకోర్టుకు వెళతా: నారాయణ
ABN , First Publish Date - 2020-12-28T09:36:17+05:30 IST
‘బిగ్‌బాస్’ షోపై త్వరలోనే హైకోర్టుకు వెళతానని సీసీఐ నేత నారాయణ అన్నారు.

తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘బిగ్‌బాస్’ షోపై త్వరలోనే హైకోర్టుకు వెళతానని సీసీఐ నేత నారాయణ అన్నారు. ‘బిగ్‌బా్‌సలో అక్కినేని నాగార్జున విజేత అభిజిత్‌కు ముగ్గురు అమ్మాయిలను చూపించి ముద్దు ఎవరిని పెట్టుకోవాలనిపిస్తుంది, ఎవరితో డేటింగ్ చేయాలని ఉంది, పెళ్లి ఎవరిని చేసుకోవాలనిపిస్తోందో చెప్పమంటాడు. మహి ళలను కించపరిచేలా మాట్లాడాడు’ అని మండిపడ్డారు. వైసీపీ అవినీతి బరుద నుంచి పుట్టిందని, దాన్ని శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. జగన్ ఇంట్లో కుక్కలకు కేటాయించినంత స్థలం కూడా పేదలకు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. విభజన సందర్భంలో ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని వంటి వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. వెంకయ్య పదవీ కాంక్ష వీడి రాష్ట్ర ప్రయోజనాలకోసం నిజాలు మాట్లాడాలని కోరారు.