భార్య ప్రసవం... భర్త మరణం

ABN , First Publish Date - 2020-05-29T20:28:28+05:30 IST

ఓ వైపు భార్య ప్రసవం., మరోవైపు భర్త హఠాన్మరణం... ఆ కుటుంబంలో తీరని విషాదం. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అజయ్‌ రెడ్డి(23)కి గతేడాది వివాహమైంది. భార్యకి నెలలు నిండి దర్శి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడంతో మగబిడ్డను ప్రసవించింది. ఇంటి వద్దనే ఉన్న భర్త అజయ్ రెడ్డి సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి ముండ్లమూరు మండలం రెడ్డినగర్ సమీపంలోని సాగర్ కాల్వలో ఈతకెళ్లాడు.

భార్య ప్రసవం... భర్త మరణం

దర్శి : ఓ వైపు భార్య ప్రసవం., మరోవైపు భర్త హఠాన్మరణం... ఆ కుటుంబంలో తీరని విషాదం. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అజయ్‌ రెడ్డి(23)కి గతేడాది వివాహమైంది. భార్యకి నెలలు నిండి దర్శి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడంతో మగబిడ్డను ప్రసవించింది. ఇంటి వద్దనే ఉన్న భర్త అజయ్ రెడ్డి సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి ముండ్లమూరు మండలం రెడ్డినగర్ సమీపంలోని సాగర్ కాల్వలో ఈతకెళ్లాడు.


కాల్వలో దిగిన స్నేహితులు మునిగిపోవడం చూసిన అజయ్... వారిని కాపాడి పూడులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. స్నేహితుడి మరణంతో షాక్‌కి గురైన అతని స్నేహితులు విషయం అజయ్ బంధువులకు చెప్పి అక్కడి నుంచి భయంతో వెళ్లిపోయారు. కొడుకు మరణవార్త విన్న అజయ్ తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి, ప్రభావతి తీరని శోకంలో మునిగిపోయారు. మనవడు పుట్టాడన్న ఆనందాన్ని అనుభవించేలోపే కొడుకు మరణం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 

Updated Date - 2020-05-29T20:28:28+05:30 IST