-
-
Home » Andhra Pradesh » Why why take
-
ఎందుకిస్తారో.. ఎందుకు తీస్తారో..!
ABN , First Publish Date - 2020-12-19T08:06:52+05:30 IST
ఐఏఎ్‌సల బదిలీలు, అప్పగిస్తున్న శాఖల్లో ప్రభుత్వం పూటకో మార్పు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేఎస్ జవహర్‌రెడ్డిని 2 నెలల కింద తిరుమల ...

ఐఏఎ్‌సల బదిలీలపై రోజుకో జీవో
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఐఏఎ్‌సల బదిలీలు, అప్పగిస్తున్న శాఖల్లో ప్రభుత్వం పూటకో మార్పు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేఎస్ జవహర్‌రెడ్డిని 2 నెలల కింద తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవోగా బదిలీ చేసింది. టీటీడీ ఈవోగా ఉన్న ఏకే సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన ఏపీఎంఎ్‌సఐడీసీ విభాగానికి మాత్రం జవహర్‌రెడ్డినే స్పెషల్ సీఎ్‌సగా నియమించింది. టీటీడీ ఈవో అంటే పూర్తిగా తిరుమల, తిరుపతిలోనే ఉండాల్సి ఉంటుంది. ఏపీఎంఎ్‌సఐడీసీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంది. ఆయన తిరుపతి నుంచి విజయవాడ రావాలంటే కుదిరే పని కాదు. అధికారులు కూడా ఫైళ్లు తీసుకుని తిరుపతికి వెళ్లే పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వం ఆయనకు జోడు పదవులు కట్టబెట్టింది. ఇప్పుడు అకస్మాత్తుగా సదరు కార్పొరేషన్‌నూ సింఘాల్‌కు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు.