జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు: నిమ్మల

ABN , First Publish Date - 2020-07-19T21:50:07+05:30 IST

సూట్‌కేసు కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడం సీఎం జగన్ వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు: నిమ్మల

అమరావతి: సూట్‌కేసు కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడం సీఎం జగన్  వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో లక్షల కోట్లు ఆర్జించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే బాటన నడుస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు తరలుతున్న హవాలా డబ్బుపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తమిళనాడు ఛానెల్స్ అన్నీ మంత్రి అనుచరుల వాంగ్మూలాలతో సహా వాస్తవాలను ప్రసారం చేసినా సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఒంగోలు నుంచి రాష్ట్ర బోర్డర్ దాటే వరకు ఏ ఒక్క చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపలేదంటే.. దీని వెనుక పెద్దల హస్తం లేదంటారా అని రామానాయుడు ప్రశ్నించారు. 


Updated Date - 2020-07-19T21:50:07+05:30 IST