మీరు కూర్చున్న సచివాలయం ఎవరు కట్టారు

ABN , First Publish Date - 2020-10-24T08:58:40+05:30 IST

‘‘అమరావతిలో ఐదు శాతం పనులు కూడా పూర్తి కాలేదంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ తాను కూర్చుని పనిచేస్తున్న సచివాలయాన్ని ఎవరు కట్టారో చెప్పాలి.

మీరు కూర్చున్న సచివాలయం ఎవరు కట్టారు

 టీడీపీ

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిలో ఐదు శాతం పనులు కూడా పూర్తి కాలేదంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ తాను కూర్చుని పనిచేస్తున్న సచివాలయాన్ని ఎవరు కట్టారో చెప్పాలి. సచివాలయంలో మొండి గోడల మధ్య కూర్చుని పనిచేస్తున్నారా? సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు... అన్నీ అమరావతి నుంచి పనిచేయడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. రాజధానిలో 70 శాతం పూర్తయిన పనులను వైసీపీ ప్రభుత్వం కుట్ర ధోరణితో నిలిపివేసింది.


అమరావతిలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌ రెడ్డి కూడా మద్దతు తెలిపారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు.   


Updated Date - 2020-10-24T08:58:40+05:30 IST