ఎవరు అవినీతికి పాల్పడిన చర్యలు: శిల్పా చక్రపాణిరెడ్డి
ABN , First Publish Date - 2020-05-29T17:05:55+05:30 IST
శ్రీశైలం దేవాలయానికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న..

కర్నూలు జిల్లా: శ్రీశైలం దేవాలయానికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. శ్రీశైలంలో వరుస అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. తన బంధువులు, స్నేహితులు ఎవరైనా చట్టానికి అతీతులుకారన్నారు. దొంగచేష్టలు మాత్రం సహించేదిలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.