పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి
ABN , First Publish Date - 2020-08-11T14:37:59+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాకు తొమ్మిది మంది బలయ్యారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,777లకు చేరింది. ఏలూరులో నిన్న 51 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14,603 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.