పశ్చిమగోదావరి జిల్లాలో మరో 45 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-08T14:28:59+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో మరో 45 కరోనా కేసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాజాగా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో 23, తాడేపల్లిగూడెంలో 12 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల 112కు చేరింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఏలూరు, పాలకొల్లులలోని టిడ్కో హౌసింగ్ కాలనీలు కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జిలో కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఎటువంటి లక్షణాలు లేకపోతే, పదిరోజుల్లోనే డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. ఏలూరు వన్‌టౌన్‌లో అధికారులు మరో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు.