వింతవ్యాధిని మాస్ హిస్టీరియాగా పేర్కొన్న మానసిక వైద్యులు

ABN , First Publish Date - 2020-12-06T15:35:57+05:30 IST

వింతవ్యాధిని మాస్ హిస్టీరియాగా పేర్కొన్న మానసిక వైద్యులు

వింతవ్యాధిని మాస్ హిస్టీరియాగా పేర్కొన్న మానసిక వైద్యులు

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధి కలకలం రేగింది. 185 మంది వింత వ్యాధి బారినపడ్డారు. నురగలు కక్కుతూ సొమ్మసిల్లి బాధితులు పడిపోతున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 158 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 27 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వింతవ్యాధితో ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. వింతవ్యాధిని మాస్ హిస్టీరియాగా మానసిక వైద్యులు భావిస్తున్నారు. దాంతో ఏలూరు పరిసరాల్లో తాగునీటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. బాధితులకు కరోనాతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. ఏలూరులోని గొల్లాయగూడెం, కొత్తపేట, శనివారపుపేట, కొబ్బరితోట, పడమరవీధి, దక్షిణపువీధి ప్రాంతాల్లో భాధితులు అత్యధికంగా ఉన్నారు. కాలనీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

Updated Date - 2020-12-06T15:35:57+05:30 IST