లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్...క్లీనర్ మృతి

ABN , First Publish Date - 2020-09-17T12:36:25+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్...క్లీనర్ మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట  సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.  బెంగళూరుకు చెందిన కాళీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ క్లీనర్ అక్కడికక్కడే  మృతి చెందగా,  మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కలకత్తా నుంచి బెంగళూరుకు వలస కూలీలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Updated Date - 2020-09-17T12:36:25+05:30 IST