ఏలూరు: జువైనల్ హోమ్‌లో ఎనిమిది మంది బాలురకు కరోనా
ABN , First Publish Date - 2020-08-11T15:02:21+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్‌లో ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్‌లో ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఏలూరు సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. తొలుత హోమ్ సూపరింటెండెంట్‌కు, తరువాత ఒక టీచర్‌కు కరోనా సోకిందని... వారి నుంచి బాలురకు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీధి బాలురు, చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి జువైనల్ హోమ్‌లో వసతి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.