పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ABN , First Publish Date - 2020-10-21T21:54:37+05:30 IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు పడుతాయని

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు పడుతాయని, మరికొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.పది రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఈ సీజన్లో ఇప్పటికి మూడుసార్లు భారీ వర్షాలు పడ్డాయి. వరదలకు రైతులు అతలాకుతలమవుతున్నారు. ముంపులు, మునకలతో లోతట్టు ప్రాంతాల వారు నీళ్లతోనే సహవాసం చేస్తున్నారు.