ఏపీలో రానున్న రెండు రోజులు...

ABN , First Publish Date - 2020-12-06T23:34:09+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో రెండు రోజులు అక్కడక్కడ మోస్తారు వర్షాలు రానున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ..

ఏపీలో రానున్న రెండు రోజులు...

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో రానున్న రెండు రోజులు అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  


Updated Date - 2020-12-06T23:34:09+05:30 IST