తప్పుడు ప్రచారం చేస్తే నాలుక కోస్తాం
ABN , First Publish Date - 2020-10-04T08:20:36+05:30 IST
జడ్జి రామకృష్ణ అవినీతిపరుడని, ఆయ న తమ్ముడు కబ్జాకోరని చిత్తూరు జిల్లా పూతలపట్టు, మదనపల్లె ఎమ్మెల్యేలు ఎమ్మెస్ బాబు,
జడ్జి రామకృష్ణ అవినీతిపరుడు: వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): జడ్జి రామకృష్ణ అవినీతిపరుడని, ఆయ న తమ్ముడు కబ్జాకోరని చిత్తూరు జిల్లా పూతలపట్టు, మదనపల్లె ఎమ్మెల్యేలు ఎమ్మెస్ బాబు, నవాజ్ బాషా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘రామకృష్ణ అవినీతిపరుడు. న్యాయమూర్తి సస్పెండయిన సం ఘటన చరిత్రలో లేదు.ఆయన బి.కొత్తకోటలో పాఠశాలను ఏర్పాటు చేసి, కోర్టులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకుండా వేధించారు. అలాంటి వ్యక్తికి సీఎంని, మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే అర్హత ఉందా? రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే నాలుక కోస్తాం’’ అని ఎమ్మెల్యే బాబు హెచ్చరించారు.
‘‘రామకృష్ణ డబ్బులు తీసుకుని తప్పుడు తీర్పులు ఇచ్చారు. జడ్జి తమ్ముడు రామచంద్ర కులాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలు, దౌర్జన్యాలు చేశాడు’’ అని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆరోపించారు.