రక్షణ పరికరాలేవీ..!

ABN , First Publish Date - 2020-03-28T09:23:03+05:30 IST

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో వార్డు వలంటీర్లు, కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఏపీ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇళ్ల నుంచి బయటికి

రక్షణ పరికరాలేవీ..!

  • వార్డు వలంటీర్లు, కార్యదర్శులకు మాస్కులు, గ్లవ్స్‌, శానిటైజర్లు ఇవ్వండి 
  • 50లక్షల కేంద్ర బీమా వర్తింపజేయాలి 
  • మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం


అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో వార్డు వలంటీర్లు, కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఏపీ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇళ్ల నుంచి బయటికి రావడానికే ప్రజలు భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వలంటీర్లు, కార్యదర్శులు కీలక బాధ్యతల్లో నిమగ్నమయ్యారని, కానీ వీరికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు తదితర రక్షణ పరికరాలను పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఇంతవరకూ సరఫరా చేయలేదని ఆందోళన వ్యక్తం చేసింది.   ప్రమాదకరమని తెలిసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితిలో వీరందరూ తమకు తోచిన స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకుని, విధులు నిర్వహిస్తున్నారని సంఘం అధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్‌-95 మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లవ్స్‌, శానిటైజర్లు తదితరాలు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల బీమా సౌకర్యం కూడా వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-03-28T09:23:03+05:30 IST