-
-
Home » Andhra Pradesh » War Between TDP And YCP
-
ఇళ్ల పట్టాల పంపిణీలో నిత్యం వివాదాలు
ABN , First Publish Date - 2020-12-28T23:39:57+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీలో నిత్యం వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అర్హులను కాదని అనర్హులకు ఇళ్లు ఇచ్చారంటూ పలు గ్రామాల్లో....

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీలో నిత్యం వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అర్హులను కాదని అనర్హులకు ఇళ్లు ఇచ్చారంటూ పలు గ్రామాల్లో ప్రజలు నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపైకి వైసీపీ కార్యకర్తలను మాత్రమే పిలుస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు, వైసీపీ ఇంఛార్జి నర్సింహరాజు వాగ్వాదానికి దిగారు.
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వకపోవడంపై దళితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రభుత్వానికి తాము ఓట్లు వేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. తమకెందుకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు. కూలీ పనులు చేసుకునే తమకు లంచాలు ఇచ్చుకునే స్థోమత లేదని వాపోయారు. లంచాలు ఇచ్చిన వారికే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు.