అందరినీ పిలవాలనుంది కానీ..

ABN , First Publish Date - 2020-12-30T08:44:33+05:30 IST

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నియోజకవర్గ ప్రజలందరికీ స్వీట్లు పంచారు.

అందరినీ పిలవాలనుంది కానీ..

నియోజకవర్గం మొత్తానికీ స్వీట్లు పంచిన చింతమనేని


పెదవేగి, డిసెంబరు 29: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నియోజకవర్గ ప్రజలందరికీ స్వీట్లు పంచారు. జనవరి 2న జరగనున్న ఈ వివాహం నేపథ్యంలో పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన 94 వేల స్వీట్‌ ప్యాకెట్లు పంచారు. ఆ స్వీట్‌ బాక్స్‌పై ‘అందరినీ వివాహానికి పిలవాలని ఉంది కానీ.. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరంతా ఆన్‌లైన్‌లోనే వివాహాన్ని వీక్షించి వధూవరులను దీవించండి’ అని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-12-30T08:44:33+05:30 IST