సరకు రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్‌కు ఆరో స్థానం
ABN , First Publish Date - 2020-07-08T08:48:56+05:30 IST
లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్ జాతీయ స్థాయిలో

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు 110.81 లక్షల టన్నుల సరకులను రవాణా చేసింది. బొగ్గు, ముడిఇనుము, ఇతర ఆహార పదార్థాలను విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, బైలదిల్లా గనుల నుంచి తరలించినట్టు డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.