కరోనా రక్షణ కిట్ల తయారీలో ‘శ్రీసిటీ’

ABN , First Publish Date - 2020-04-18T10:26:40+05:30 IST

శ్రీసిటీలోని పరిశ్రమల్లో కరోనా రక్షణ కిట్ల తయారీ ముమ్మరంగా సాగుతోంది. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ (పీపీఈ) ...

కరోనా రక్షణ కిట్ల తయారీలో ‘శ్రీసిటీ’

సత్యవేడు, చిత్తూరు, ఏప్రిల్‌ 17: శ్రీసిటీలోని పరిశ్రమల్లో కరోనా రక్షణ కిట్ల తయారీ ముమ్మరంగా సాగుతోంది. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ (పీపీఈ) కిట్లు, అత్యవసర ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఇక్కడ తయారవుతున్నాయి. పాల్స్‌ప్లష్‌ కంపెనీ ఫేస్‌షీల్డులతో కూడిన పీపీఈ కిట్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికాకు చెందిన వీఆర్వీ ఆసియా పసిఫిక్‌ పరిశ్రమ క్రయోజనిక్‌ సిలిండర్లను తయారు చేస్తోంది. వైటెల్‌ పేపర్స్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమ అత్యవసర ఆస్పత్రి పడకలను తయారు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించే ప్రయత్నంలో శ్రీసిటీ పరిశ్రమలు భాగస్వాములు కావడం గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ ఎండీ రవీంద్ర అన్నారు. 

Updated Date - 2020-04-18T10:26:40+05:30 IST