నాటుసారా తయారు చేసే ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-23T02:30:35+05:30 IST

నాటుసారా తయారు చేసే ముఠా అరెస్ట్

నాటుసారా తయారు చేసే ముఠా అరెస్ట్

విశాఖపట్నం: నాటు సారా తయారు చేసే ముఠాను విశాఖ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటు సారాకు ఉపయోగించే అమోనియా, నల్లబెల్లాన్ని ఒరిస్సాకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ ఎక్సైజ్ పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితులు అరకు వేలి మండలం పూజారిగూడ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులు నాటు సారా రవాణాకు ఉపయోగించినఆటోను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.


Updated Date - 2020-07-23T02:30:35+05:30 IST