గ్యాస్ లీకేజీ కారణాలపై పూణే ఎన్డీఆర్ఎఫ్ బృందం దర్యాప్తు

ABN , First Publish Date - 2020-05-08T12:57:59+05:30 IST

విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ కెమికల్ కర్మాగారంలో విషవాయువు లీకేజీకి కారణాలపై పూణే నుంచి వచ్చిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది.

గ్యాస్ లీకేజీ కారణాలపై పూణే ఎన్డీఆర్ఎఫ్ బృందం దర్యాప్తు

విశాఖపట్టణం : విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ కెమికల్ కర్మాగారంలో విషవాయువు లీకేజీకి కారణాలపై పూణే నుంచి వచ్చిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీలో నుంచి గురువారం అర్దరాత్రి కూడా మళ్లీ గ్యాస్ లీకైన నేపథ్యంలో ఈ కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలు రెండు రోజుల వరకు ఇళ్లకు రావద్దని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సూచించారు.శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ పూణే బృందం సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ వద్దనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా కంపెనీ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో కర్మాగారం సమీపంలోని 5 కిలోమీటర్ల దూరంలోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు. మాధవధార ప్రాంతం వరకు గ్యాస్ తీవ్రత వ్యాపించడంతో ఇక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. 


Updated Date - 2020-05-08T12:57:59+05:30 IST