కొడాలి నాని వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-21T19:47:19+05:30 IST

విజయవాడ: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొడాలి నాని వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

విజయవాడ: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. 151 సీట్లు వచ్చాయని ఏం మాట్లాడుతున్నామో స్పృహ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో 151కి బదులు మధ్యలో ఉన్న 5 సీట్లు మాత్రమే వస్తాయన్నారు.


కొడాలి నాని వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం బ్రిటిష్ కాలం నుంచి అమలు జరుగుతోందన్నారు.ఇప్పుడు డిక్లరేషన్ వద్దు అనడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అధికారం ఉందని ఏదైనా చేయగలం అనుకుంటే పొరబాటు అని.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడాన్ని కొనసాగించాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-21T19:47:19+05:30 IST