శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు

ABN , First Publish Date - 2020-06-21T14:38:20+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు

చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్లకు గ్రహణకాల అభిషేకాలు నిర్వహిస్తున్నారు.


సూర్యగ్రహణంతో దేశంలో ప్రధాన ఆలయాలు మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంచారు. యధావిధిగా భక్తులకు పూజలు, దర్శనాలు కొనసాగుతున్నాయి. నిత్యం 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో కూడిన నవగ్రహ కవచాన్ని శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడికి అలంకార కవచంగా ధరించడం వలన గ్రహణకాతీతుడిగా శ్రీకాళహస్తీశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఆలయంలో భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. యధావిధిగా రాహు-కేతు కాలసర్పదోష నివారణ పూజలు, గ్రహణ ఘడియల్లో స్వామి వారికి గ్రహణ కాలాభిషేకాలు, గ్రహణ మోక్ష కాలం అనంతరం స్వామి, అమ్మ వార్లకు మూడో కాలాభిషేక పూజలు సాయత్రం 4 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.

Updated Date - 2020-06-21T14:38:20+05:30 IST