వైసీపీ-టీడీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి?: విష్ణువర్దన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-11-03T17:19:41+05:30 IST
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అంచనాలు చెప్పాల్సింది ప్రభుత్వం కాదని... పోలవరం అథారిటీ అని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరం, హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపించిందన్నారు. అధికారంలోకి వచ్చి 17నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ-టీడీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటని నిలదీశారు. ఏపీలో రివర్స్ టెండరింగ్ కాదని... రివర్స్ పాలన జరుగుతోందని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.