రిజర్వేషన్లను అపహాస్యం చేస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-03-08T18:35:11+05:30 IST

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రిజర్వేషన్లను గంట గంటకూ మారుస్తూ వాటిని అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై

రిజర్వేషన్లను అపహాస్యం చేస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

విజయవాడ: అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రిజర్వేషన్లను గంట గంటకూ మారుస్తూ వాటిని అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సంఘం వైసీపీ సంస్థాగత ఎన్నికలు జరుపుతుందా? స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతుందా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు సీఎం జగనే ఎన్నికల్లో గెలవకపోతే మీ ఉద్యోగాలు పోతాయని మంత్రులను బెదిరిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ-జనసేన క్యాడర్ ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు.

Updated Date - 2020-03-08T18:35:11+05:30 IST