జగన్‌ పాలనలో హిందువులు, ఆలయాలు సేఫ్‌!

ABN , First Publish Date - 2020-11-21T09:03:00+05:30 IST

ష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

జగన్‌ పాలనలో హిందువులు, ఆలయాలు సేఫ్‌!

విష్ణువర్ధన్‌ రెడ్డి ట్వీట్‌..

హిందువుల ఆగ్రహం


అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి  మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలపై పోరాటం చేసిన పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన ట్వీట్‌ చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలోని హిందువులు, హిందూ ధార్మిక స్థలాలు సురక్షితంగా ఉన్నాయంటూ ఆయన చేసిన ట్వీట్‌ దుమారం రేకెత్తించింది. విష్ణు ట్వీట్‌పై ధార్మిక సంఘాల ప్రతినిధులు, అర్చకులు, వేద పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై విష్ణువర్ధన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యంగ్యంగా ఆ పోస్టు పెట్టానని తెలిపారు. 

Read more