బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్లే: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T23:25:15+05:30 IST

అక్రమంగా అరెస్ట్ చేసి 20 గంటల పాటు పలు ప్రాంతాలలో తిప్పారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్లే: విష్ణువర్ధన్‌రెడ్డి

అనంతపురం: అక్రమంగా అరెస్ట్ చేసి 20 గంటల పాటు పలు ప్రాంతాలలో తిప్పారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంతర్వేది ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం.. బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్లేనని హెచ్చరించారు. సీఎం జగన్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విష్ణువర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2020-09-18T23:25:15+05:30 IST