విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాలప్రసాద్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-11-25T09:40:22+05:30 IST
విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు ముత్యాలప్రసాద్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. కొద్దిరోజులక్రితం ఆయనకు కొవిడ్ సోకింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, గుండెపో టు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణలంక వి ద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయానికి అం త్యక్రియలు
విజయవాడ, అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు ముత్యాలప్రసాద్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. కొద్దిరోజులక్రితం ఆయనకు కొవిడ్ సోకింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, గుండెపో టు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణలంక వి ద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయానికి అం త్యక్రియలు పూర్తయ్యాయి. ప్రసాద్ స్వస్థలం కృష్ణాజి ల్లా ఆగిరిపల్లి మండలం కలటూరు. కమ్యూనిస్టు నా యకుడు దాసరి నాగభూషణరావు ప్రభావంతో వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. జర్నలిజాన్ని వృత్తిగా మార్చుకొని పలు తెలుగు దినపత్రికల్లో పనిచేశా రు. మరణించేనాటికి అరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రసాద్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంతాపం ప్రకటించారు.