‘ఎల్జీ’ బృందం స్వదేశీ ప్రయాణానికి అనుమతి
ABN , First Publish Date - 2020-06-25T08:18:34+05:30 IST
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కారణాలు అన్వేషించేందుకు వచ్చిన 8 మంది దక్షిణ కొరియావాసులు..

అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కారణాలు అన్వేషించేందుకు వచ్చిన 8 మంది దక్షిణ కొరియావాసులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, వీరంతా తమ చిరునామాలు, మొబైల్ నెంబర్లు తదితర వివరాలు సమర్పించాలని, దర్యాప్తునకు పోలీసులు ఎప్పుడు పిలిచినా రావాలని షరతు విధించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.