ఎట్టకేలకు స్పందించిన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం

ABN , First Publish Date - 2020-05-09T18:56:40+05:30 IST

గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది.

ఎట్టకేలకు స్పందించిన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం

విశాఖ: గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. ఘటనపై సాంకేతిక నిపుణులు, ప్రభుత్వంతో కలిసి విచారణ జరుపుతామని ఎల్జీ పాలిమర్స్‌ తెలిపింది. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బాధితుల మెడికల్‌ అవసరాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. పరిస్థితి మొత్తం పూర్తిగా అదుపులోకి వచ్చిందని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తామని పేర్కొంది. 

Updated Date - 2020-05-09T18:56:40+05:30 IST