గ్యాస్ లీక్ ఘటన...కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
ABN , First Publish Date - 2020-05-09T16:44:34+05:30 IST
గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందినవారికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విశాఖ: గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందినవారికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖపట్నంలో ప్రమాదకర వాయువుల లీకేజీలో 12 మంది మరణించగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ పరిసరాలు సాధారణ పరిస్థితికి వచ్చాయన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని పేర్కొన్నారు.