ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. సీఎంకు ఎమ్మెల్యే లేఖ
ABN , First Publish Date - 2020-08-16T23:32:18+05:30 IST
ఆగనంపూడిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 80 ఎకరాల స్థలం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు

విశాఖపట్నం: ఆగనంపూడిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 80 ఎకరాల స్థలం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. తాను ఒక ప్రజా ప్రతినిధిగా కాకుండా ఒక స్పోర్ట్స్‌మెన్‌గా, విశాఖవాసిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తామనడం సరికాదన్నారు. విశాఖలోనే క్రీడల మంత్రి ఉన్నారని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఎంను గణబాబు కోరారు. క్రీడారంగం ఆభివృద్ధి చెందితే, ఇతర రంగాలకు అది ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.