విశాఖలో యాంటీ డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్

ABN , First Publish Date - 2020-12-16T04:31:39+05:30 IST

విశాఖలో యాంటీ డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్

విశాఖలో యాంటీ డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్

విశాఖ: నగరంలో యాంటీ డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు స్పెషల్ ఇన్ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషినల్ డీసీపీ అజిత వాజేండ్ల తెలిపారు. పిల్లల కదలకలపై తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాలని, డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, వారిపై దృష్టి సారించాలని చెప్పారు. ఇటీవల రెండు కేసుల్లో 64 కిలోల గంజాయిను సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇందులో ఇద్దర్ స్మగ్లర్లు కలకత్తాకు చెందినవారుగా గుర్తించామన్నారు. విశాఖ వ్యాప్తంగా డ్రగ్ వ్యవహారాలపై నిఘా పెంచామని, కేసులు కూడా నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇదేవిధంగా మరో కేసులో పాన్ మసాలా, మత్తు పదార్థాలను సీజ్ చేసినట్టు వాటిని ల్యాబ్ టెస్ట్ కు తరలించామన్నారు. విశాఖలో యాంటీ డ్రగ్స్‌పై నిత్యం దాడులు నిర్వహిస్తామని తెలిపారు.

Read more