అందుకే జల విహార నియంత్రణ కేంద్రం ఏర్పాటు: విశాఖ కలెక్టర్

ABN , First Publish Date - 2020-06-19T19:26:12+05:30 IST

అందుకే జల విహార నియంత్రణ కేంద్రం ఏర్పాటు: విశాఖ కలెక్టర్

అందుకే జల విహార నియంత్రణ కేంద్రం ఏర్పాటు: విశాఖ కలెక్టర్

విశాఖపట్నం: కల్చులూరు బోటు ప్రమాదం తరువాత ప్రమాదాల నియంత్రణ కోసం జల విహర నియంత్రణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. శుక్రవారం రుషికొండలో పర్యాటక జల విహర నియంత్రణ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ మాట్లాడుతూ...రుషికొండలో ఎడాదికి 30 నుండి 40 వేల మంది బోటింగ్ చేసేందుకు వస్తారని...ఎలాంటి ప్రమాదాలు జరిగకుండా ఉండేందుకు ఈ కంట్రోల్ రూమ్ దోహదపడతాయని వెల్లడించారు. రెవెన్యూ, పోలీసులు, బోటు ఆపరేటర్లు సమన్వయంతో పని చేస్తారని తెలిపారు. 


ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రమాదంపై 20న హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగుతుందని చెప్పారు. ప్రమాదం జరిగిన తరువాత అక్కడ నీటి పరిస్థితులపై తోతుగా అద్యయనం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 63 కంటైన్మంట్ జోన్లులు ఉన్నాయని...కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-06-19T19:26:12+05:30 IST