సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం.. 8 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-15T00:00:39+05:30 IST
సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన ఇత్తడి వస్తువులను..

విశాఖ: సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన ఇత్తడి వస్తువులను ఈ మాయగాళ్లు కరిగించారు. ఇత్తడి వస్తువుల మాయం వెనుక ఆలయ మాజీ ప్రైవేట్ ఉద్యోగి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విడతలు విడతలుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇత్తడి వస్తువులను తరలించినట్లు నిర్ధారించారు. ఈ నెల 10న సింహచలం దేవస్థానంలో 550 కేజీల ఇత్తడి సామాగ్రి చోరీ జరిగింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు త్వరగా పురోగతి సాధించారు. ఇత్తడి గంటలు, కంచాలు, భజన తాళాలతో పాటు కరిగించిన ఇత్తడి దిమ్మలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.