దారుణం: యువతిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2020-11-01T03:45:03+05:30 IST

గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ...

దారుణం: యువతిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

విశాఖ: గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద యువతితో మాట్లాడిన తర్వాత అఖిల్ ఒక్కసారిగా ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన సమయంలో అఖిల్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. 

Read more