విశాఖ గ్రామాలు ఇప్పటిలో కోలుకోవా?

ABN , First Publish Date - 2020-05-14T00:08:06+05:30 IST

విశాఖ గ్రామాలు తిరిగి కోలుకునేదెప్పుడు?. అందుకు అనువైన మార్గాలు ఇప్పట్లో ఉన్నాయా?. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?...

విశాఖ గ్రామాలు ఇప్పటిలో కోలుకోవా?

విశాఖపట్నం: విశాఖ గ్రామాలు తిరిగి కోలుకునేదెప్పుడు?. అందుకు అనువైన మార్గాలు ఇప్పట్లో ఉన్నాయా?. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?. అక్కడి ప్రజలు మళ్లీ తిరిగి జీవనాన్ని సాగించేదెప్పుడు? అనే అంశాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఘటనపై నియమించిన కమిటీ ఒకటి గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో విచారణ సాగిస్తోంది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. 


అప్పటివరకు ప్రజలను కూడా ఆయా గ్రామాలకు వెళ్లనివ్వకూడదు. గ్యాస్ లీక్ ప్రభావితమైన ప్రజలు తిరిగి కోలుకోవడానికి ఉన్న మార్గాలేంటి? అన్న దానిపై కూడా వైద్య రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైరిన్ వాయివు అత్యంత విష వాయువులైన జాబితాలో 30లోపు వాటిలో ఒకటిగా ఉంది. ఇది మనుషులు, జంతువులు, పంటలతో పాటు సమస్థ జీవ కోటిపైనా ప్రభావం చూపగలదు. మనుషుల శ్వాస ద్వారా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు ఊపరితిత్తులు, మూత్ర పిండాలు, గుండెలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో బతికి బయటపడ్డ వారికి  సైతం భవిష్యత్తులో వివిధ రకాల సమస్యలు వెంటాడుతాయని కూడా చెబుతున్నారు. మరి ఇంతటి ప్రభావం చూపించిన కాలకూట విషాన్ని ఈ గ్రామాల ప్రజలు ఇంతటితో వదిలించుకోగలరా?. భవిష్యత్తులో ఈ జ్ఞాపకాలను తమ జీవితాలలో ఇబ్బంది పెట్టకుండా అధిగమించగలరా? అంటే వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

Read more