విశాఖలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-07-27T23:32:06+05:30 IST
షీలానగర్‌లోని గేట్ వే ఈస్ట్ ఇండియా కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది సకాలంలో..

విశాఖ: షీలానగర్‌లోని గేట్ వే ఈస్ట్ ఇండియా కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. క్రేన్ తో కంటైనర్లను తొలగిస్తున్నక్రమంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. కంటైనర్లలో కెమికల్స్ ఉండటంతో వెంటనే మంటలు వ్యాపించాయి. పెదగంట్యాడ ఆటో నగర్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.