ఆవేశంలో అన్న పదాలపై మన్నించమని కోరుతున్నా: సబ్బంహరి

ABN , First Publish Date - 2020-10-04T22:42:19+05:30 IST

మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడను శనివారం తెల్లవారుజామున జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే ..

ఆవేశంలో అన్న పదాలపై మన్నించమని కోరుతున్నా: సబ్బంహరి

విశాఖ: మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడను శనివారం తెల్లవారుజామున జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే నోటీసు ఇవ్వకుండా కూల్చేవేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చూశారు. అంతేకాదు ఆవేశంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సబ్బంహరి వివరణ ఇచ్చుకున్నారు. ఆవేశంలో అన్న పదాలపై మన్నించమని కోరుకున్నారు. ఎవరికో భయపడి మన్నించమని కోరడంలేదన్నారు. తానూ మనిషినేనని.. తనకు ఫీలింగ్ ఉంటాయని చెప్పారు. ప్రహరీ కూల్చివేతలో అధికారులను తాను తప్పుబట్టడంలేదని సబ్బంహరి స్పష్టం చేశారు. 


Updated Date - 2020-10-04T22:42:19+05:30 IST