మధురవాడలో రూ. 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని...

ABN , First Publish Date - 2020-09-06T23:12:04+05:30 IST

మధురవాడలో రూ. 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని...

మధురవాడలో రూ. 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని...

విశాఖ: మధురవాడలో రూ. 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన 5 గురు వ్యక్తులను పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. నకిలి డాక్యుమెంట్ తో సర్వే నెంబరు 249/10 కి బదులుగా 249/10B గా మార్చిన పిల్లా రాము అతని కుటుంబ సభ్యులు పిల్లా సూరమ్మ,పోతిన ఎల్లయ్యమ్మ, ఎల్లిపల్లి పైడి కొండను అదుపులోకి తీసుకున్నారు. రియాల్ ఎస్టేట్ వ్యాపారి జామీసత్య రవికిషోర్‌తో స్థలం కబ్జాకు ప్రయత్నంచారు. కబ్జా దారులపై భూ యాజమాని ధనరాజు కళ్యాణి ఫిర్యాదు చేసింది. భూకబ్జా దారులపై ఐపీసీ సెక్షన్ 447,465,467,r/w 120-b కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-06T23:12:04+05:30 IST