విశాఖ: పద్మనాభంలో వైసీపీ కార్యకర్తల అరాచకం

ABN , First Publish Date - 2020-03-12T15:26:30+05:30 IST

విశాఖ: పద్మనాభంలో వైసీపీ కార్యకర్తల అరాచకం

విశాఖ: పద్మనాభంలో వైసీపీ కార్యకర్తల అరాచకం

విశాఖపట్నం:  విశాఖలోని పద్మనాభం మండలంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అనంతవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించివేశారు. అధికారి దగ్గర నామినేషన్‌ పత్రాలు తీసుకుని మరీ వైసీపీ కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అధికారి వద్ద పత్రాలు తీసుకుని చించివేశారంటూ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వీరికి టీడీపీ నేత సబ్బం హరి మద్దతు పలికారు. 


Updated Date - 2020-03-12T15:26:30+05:30 IST