రేషన్ సరుకుల కోసం లైన్‌లో నిల్చున్న వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2020-03-31T01:02:50+05:30 IST

జిల్లాలోని చోడవరంలో ఉన్న ద్వారకా నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రేషన్ సరుకుల కోసం క్యూ లైన్ లో నిల్చున్న షేక్ మీరాబి(65) అనే వృద్ధురాలు మృతి చెందింది.

రేషన్ సరుకుల కోసం లైన్‌లో నిల్చున్న వృద్ధురాలు మృతి

విశాఖ: జిల్లాలోని చోడవరంలో ఉన్న ద్వారకా నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రేషన్ సరుకుల కోసం క్యూ లైన్ లో నిల్చున్న షేక్ మీరాబి(65) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఉదయం నుంచి ఎండలో నిల్చున్న ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇంటికి తీసుకు వెళ్లేలోపే కన్నుమూసింది. అధికారులు ఎండలో నిలబెట్టడంతోనే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


మరోవైపు విశాఖ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల ఎదుట రద్దీ నెలకొంది. ఏప్రిల్ అంతా రేషన్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రజలు బారులు తీరుతున్నారు. సామాజిక దూరం కూడా పాటించడం లేదు. సందట్లో సడేమియా అన్నట్టు కార్పొరేటర్ అభ్యర్థులు అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు.  

Updated Date - 2020-03-31T01:02:50+05:30 IST