విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2020-06-02T01:35:09+05:30 IST

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని మంత్రి కన్నబాబు జోస్యం చెప్పారు. విశాఖ భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు చేస్తోందని, ఎంతటి వారున్నా సరే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది: మంత్రి కన్నబాబు

అమరావతి: విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని మంత్రి కన్నబాబు జోస్యం చెప్పారు. విశాఖ భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు చేస్తోందని, ఎంతటి వారున్నా సరే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనే భూముల అమ్మకం మొదలైందని, విశాఖలో భవిష్యత్ తాగునీటి అవసరాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. గోదావరి నుంచి విశాఖకు పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధ చేశామని తెలిపారు. గ్యాస్‌లీక్‌ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కన్నబాబు పేర్కొన్నారు. మిడతల దండు రాష్ట్రంలోకి రాలేదని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జూలై 8న ఇళ్ల స్థలాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-02T01:35:09+05:30 IST