విశాఖలో దంపతుల ప్లాన్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు
ABN , First Publish Date - 2020-04-29T02:42:18+05:30 IST
నగరంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఓ జంటకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో ఇంట్లో ఉండలేక నగరానికి చెందిన దంపతులు..

విశాఖపట్నం: నగరంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఓ జంటకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో ఇంట్లో ఉండలేక నగరానికి చెందిన దంపతులు ఎలాగైనా బయట తిరగాలని ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ‘బేబీ’ ప్లాన్ వేశారు. పసిపాప ఆకారంలోని బొమ్మను ఒడిలో పెట్టుకుని దంపతులు నగరంలో తిరగారు. ఇలా కొన్ని చోట్ల పోలీసుల నుంచి వారు తప్పించుకున్నప్పటికీ.. ఒక చోట మాత్రం పోలీసులు వారి ప్లాన్‌ను చిత్తు చేశారు. వారి బొమ్మ నాటకాన్ని పసిగట్టారు. ఆలస్యంగా వచ్చిన ఈ ఘటనలో.. దంపతులపై కేసు నమోదుచేసినట్లు తెలుస్తోంది.