-
-
Home » Andhra Pradesh » Visakhapatnam Avanti
-
విశాఖలో పరిణామాలు దురదృష్టకరం: అవంతి
ABN , First Publish Date - 2020-12-27T19:41:31+05:30 IST
జిల్లాలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

విశాఖ: జిల్లాలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వెలగపూడి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.సీఎం జగన్, ఎంపీ విజయసాయిని అనే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు.పిచ్చిపిచ్చి ప్రేలాపణలు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని విమర్శించారు.వెలగపూడి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసు అని చెప్పారు. వెలగపూడిపై క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.