-
-
Home » Andhra Pradesh » visakhapatnam
-
ఆకలితో చస్తున్నాం...వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన
ABN , First Publish Date - 2020-05-13T16:46:28+05:30 IST
ఆకలితో చస్తున్నాం...వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతం వెంకటాపురం వాసులు మళ్లీ ఆందోళనకు దిగారు. తమ ఇళ్ళల్లో నిత్యావసర వస్తువులన్నీ కూడా పాడయ్యాయని బయటపారేశామని... ఇక ఆహారం, మంచినీళ్లు అన్ని అందిస్తామని ప్రకటించి ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని మండిపడ్డారు. మంత్రులు, ఎంపీలు ఉన్నప్పుడు అన్నీ తీసుకువచ్చారని ఇప్పుడు ఆకలి మంటలతో చస్తున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.