అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

ABN , First Publish Date - 2020-09-24T16:00:10+05:30 IST

విశాఖ అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

విశాఖపట్నం: విశాఖ అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో  పోస్టర్లు వేశారు. అరకు లోయలో అన్ని ప్రధాన కూడళ్లలో పోస్టర్లను అతికించారు. బూటకపు ఉద్యమాలు తమకొద్దని, అభివృద్ధే తమకు ముఖ్యమని...ఇన్పార్మర్ల పేరిట అమాయక గిరిజనులను హతమార్చడమే ఉద్యమమా అంటూ పోస్టర్లలో విమర్శలు గుప్పించారు. మావోయిస్టు అశోక్ భార్య గంజాయి సాగుచేస్తున్నారని ఉండడంతో ప్రజలలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-09-24T16:00:10+05:30 IST