సరియా జలపాతంలో వ్యక్తి గల్లంతు
ABN , First Publish Date - 2020-09-14T16:13:03+05:30 IST
జిల్లాలోని అనంతగిరి మండలం సరియా జలపాతంలో భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన రమేష్ (24)అనే వ్యక్తి గల్లంతయ్యాడు.
విశాఖపట్నం: జిల్లాలోని అనంతగిరి మండలం సరియా జలపాతంలో భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన రమేష్ (24)అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు విఘాతం ఏర్పడింది. గల్లంతైన యువకుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. రమేష్ గల్లంతుతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.