నేటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక కేంద్రాలు

ABN , First Publish Date - 2020-09-05T14:37:16+05:30 IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ పర్యాటక కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.

నేటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక కేంద్రాలు

విశాఖపట్నం: కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ పర్యాటక కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. బొర్రాకేవ్స్, కైలాసగిరి రోప్‌వే, రుషికొండ బోటింగ్ సహా టూరిజం, మ్యూజియంల రీఓపనింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటక కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా సూచనలు పాటిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు పర్యాటక కేంద్రాల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-09-05T14:37:16+05:30 IST